కలం, వెబ్‌డెస్క్: సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్-2 (Jailer 2) సినిమా టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం (AP Government) అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర హోం శాఖ నేడు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 15న విడుదల కానున్న ఈ సినిమాకు వారం రోజుల పాటు ధరలు పెంచుకునేందుకు అనుమతించారు. అక్టోబర్ 15 నుంచి 21 వరకు పెంచిన టికెట్ ధరలు అమల్లో ఉండనున్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో టికెట్‌పై రూ.50, మల్టీప్లెక్స్‌లలో రూ.75 చొప్పున పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, పెంచిన ధరలకు అదనంగా జీఎస్టీ కూడా వర్తించనుంది. రోజుకు ఐదు షోల వరకు ఈ ధరల పెంపు వర్తిస్తుందని స్పష్టం చేసింది. నిర్మాత కళానిధి మారన్, సితార ఎంటర్టైన్మెంట్స్ చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని థియేటర్లకు ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి.

