రెండో దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

కలం, వెబ్ డెస్క్: ఏపీలో గ్రామ పంచాయతీ రెండో దశ ఎన్నికల (Gram Panchayat Elections)కు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండో దశలో 4,960 సర్పంచులు, 49,224 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 21న నామినేషన్ల పరిశీలన, 23న అప్పీళ్ల పరిష్కారం, 24న నామినేషన్ల ఉపసంహరణ చేపట్టనున్నారు. ఈ నెల 29న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం ఫలితాలను వెల్లడించనున్నారు. ఎక్కడైనా ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి ఉంటే.. అలాంటి గ్రామాల్లో ఈ నెల 30న పోలింగ్ చేపట్టి.. అదే రోజు ఫలితాలు విడుదల చేయనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>