కలం, వెబ్ డెస్క్ : వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందించింది. మూడో విడతగా 2,027 నిర్వాసిత కుటుంబాలకు రూ.250 కోట్ల పరిహారాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu) అందించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఈ నెల 31న వెలిగొండ ప్రాజెక్ట్ తొలి దశను ప్రారంభిస్తామని కీలక ప్రకటన చేశారు.
30 ఏళ్లుగా అసాధ్యమని భావించిన వెలిగొండ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేసి సాధ్యం చేసి చూపించామని వెల్లడించారు. ప్రాజెక్ట్ కారణంగా నిర్వాసితులైన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చంద్రబాబు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్ట్ తొలి దశ ప్రారంభంతో ఈ ప్రాంతానికి సాగు, తాగునీటి అవసరాలు మరింత మెరుగుపడనున్నాయి. ఇప్పటి వరకు నిర్వాసితులకు రూ.768 కోట్లను ప్రభుత్వం అందజేసింది.

