గిన్నీస్ రికార్డు.. కరాటే మాస్టర్‌కు సీపీ శ్వేత అభినందనలు

కలం, వరంగల్: కరాటే పోటీల్లో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించిన హనుమకొండ నయీమ్ నగర్ ప్రాంతానికి చెందిన కరాటే మాస్టర్ ధామేర శంకర్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత (CP Swetha) అభినందించారు. ఈ సందర్భంగా సీపీ శ్వేత మాట్లాడుతూ.. కఠోర సాధన, పట్టుదలతో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించడం అభినందనీయమని అన్నారు. ధామేరా శంకర్ (Karate Master Dhamera Shankar) సాధించిన ఈ ఘనత, తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు. వరల్డ్ కరాటే మాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 16వ తేదీన చెన్నైలో నిర్వహించిన కరాటే పోటీల్లో నిరవధికంగా ఆరు గంటల పాటు ధామేర శంకర్ కరాటే ప్రదర్శన నిర్వహించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>