కలం, సినిమా : దర్శకుడు అనిల్ రావిపూడికి (Anil Ravipudi) సంక్రాంతికి హిట్స్ ఇచ్చే దర్శకుడిగా పేరొచ్చింది. ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవితో “మన శంకరవరప్రసాద్ గారు” (Mana Shankara Varaprasad Garu) సినిమాతో అనిల్ రావిపూడి బ్లాక్‌బస్టర్ అందించారు. తన ఫేవరేట్ హీరో వెంకటేష్ (Venkatesh) తో ఈ సినిమాలో వెంకీ గౌడ అనే గెస్ట్ రోల్ చేయించారు. ఇక వచ్చే సంక్రాంతికి కూడా అనిల్ ఓ సినిమాను ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. కథ రెడీ అయితే పక్కా ప్లాన్‌తో ఆర్నెళ్లలో సినిమాను రిలీజ్ చేసే ఈ దర్శకుడికి మళ్లీ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకురావడం పెద్ద సమస్య కాకపోవచ్చు.
నెక్ట్స్ పొంగల్‌కు అనిల్ చేయబోయే సినిమా విక్టరీ వెంకటేష్‌తో అనే టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా పట్టాలెక్కితే ఎఫ్ 2, ఎఫ్ 3, సంక్రాంతికి వస్తున్నాం, మన శంకరవరప్రసాద్ గారు సినిమాల తర్వాత వీళ్ల కాంబోలో వచ్చే ఐదో చిత్రం అవుతుంది. గత నాలుగు సినిమాల్లో వెంకీని ఆయన ఇమేజ్‌కు తగినట్లు చూపిస్తూ అనిల్ రావిపూడి ఎంతో ఎంటర్‌టైన్ చేశారు. ఐదో చిత్రంలో కూడా అలాంటి ఓ మంచి ఎంటర్టైనర్‌తో రావాలని చూస్తున్నట్లు సమాచారం.
ఇక మరోవైపు వరుస సక్సెస్‌లతో ఈ దర్శకుడు రెమ్యునరేషన్ పెంచాడని తెలుస్తుంది. దాదాపు 50 కోట్ల రూపాయలను ఆయన నెక్ట్స్ సినిమాకు ఇచ్చేందుకు ప్రొడ్యూసర్స్ ఆఫర్ చేస్తున్నారట. ఇండస్ట్రీలో డిమాండ్ అండ్ సప్లై రూల్ ఉంటుంది కాబట్టి సూపర్ హిట్ సినిమాలు తీస్తున్న దర్శకుడిగా అనిల్ రావిపూడికి 50 కోట్ల రూపాయల ఫీజు ఇవ్వొచ్చని నిర్మాతలు భావిస్తున్నారు. తరువాత సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయితే ఇంకా పెద్ద ఆఫర్ ఇస్తారేమో చూడాలి.


