కలం, వెబ్ డెస్క్ : ప్రధాని నరేంద్ర మోడీ (Modi) పశ్చిమబెంగాల్ పర్యటనలో కొత్త నినాదం ఇచ్చారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపు తరువాత బెంగాల్ (West Bengal) వంతు వచ్చిందని అన్నారు. బీజేపీ కావాలి.. మార్పు రావాలి అంటూ ప్రధాని కొత్త నినదించారు. హౌరా – గౌహతి మధ్య నడిచే మొదటి వందే భారత్ స్లీపర్ రైలును (Vande Bharat Sleeper Train) ప్రధాని మోదీ ప్రారంభించారు అనంతరం మాల్టా లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.
ఈ సందర్భంగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై (Mamata Banerjee) తీవ్ర విమర్శలు చేశారు. టీఎంసీ అంటే అవినీతి, హింస, బుజ్జగింపు రాజకీయాల పార్టీ అనే విషయం స్పష్టమైందన్నారు. బెంగాల్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకుంటుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని ప్రజలకు అందకుండా టీఎంసీ ప్రభుత్వం అడ్డుకుంటుందని తీవ్ర విమర్శలు చేశారు. పశ్చిమ బెంగాల్ అభివృద్ధి చెందాలంటే, ప్రజలకు సంక్షేమ పథకాలు చేరాలంటే రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలని మోడీ (Narendra Modi) తెలిపారు.
Read Also: ప్రతీ మున్సిపల్ బాడీలో ట్రాన్స్ జెండర్… త్వరలో చట్టసవరణ కోసం ఆర్డినెన్స్
Follow Us On : WhatsApp


