Mobile Popup Ad
Mobile Popup Ad

బుచ్చిబాబు సారీపై అనంత శ్రీరామ్ ఫైర్

కలం, సినిమా : ‘పెద్ది'(Peddi) సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) పాత్రకు సంబంధించి దర్శకుడు బుచ్చిబాబు (Buchi Babu Sana)  క్షమాపణలు చెప్పడం తనకు నచ్చలేదని లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ (Anantha Sriram) వ్యాఖ్యానించారు. ఒక పాత్రను రాసుకున్న దర్శకుడికి పూర్తి అవగాహన ఉంటుందని, అలాంటి సమయంలో సోషల్ మీడియా ఒత్తిడికి లోనై క్షమాపణ చెప్పడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత అభిప్రాయాలను రుద్దడం వల్ల సృజనాత్మకత దెబ్బతింటుందని, ఇదే ట్రెండ్ కొనసాగితే భవిష్యత్తులో కమర్షియల్ సినిమాలు తగ్గి, డాక్యుమెంటరీలే ఎక్కువగా వస్తాయని ఆయన హెచ్చరించారు.

ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ అభిప్రాయం చెప్పే హక్కు ఉన్నా, క్రియేటివ్ ఫ్రీడమ్‌కు అడ్డంకులు రావడం మంచిది కాదని అన్నారు. ఇక తన ఐటమ్ సాంగ్‌పై వచ్చిన విమర్శలపై కూడా అనంత శ్రీరామ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐటమ్ సాంగ్‌ను ఐటమ్ సాంగ్‌గా స్వీకరించిన వారు దాన్ని ఒక ప్రత్యేకమైన వినోదంగా చూస్తారని, అలా స్వీకరించని వారు విమర్శలు చేస్తారని అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>