ఇంకా బాగా ఆడుండాల్సింది: అనాహత్

కలం, స్పోర్ట్స్: ఆసియా క్రీడల మహిళల సింగిల్స్ స్క్వాష్ ఫైనల్లో (Squash Final)  ఓటమిపై భారత యువ సంచలనం అనాహత్ సింగ్ (Anahat Singh) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మలేషియా క్రీడాకారిణి శివసంగరి సుబ్రమణ్యం చేతిలో 4-11, 4-11, 7-11 తేడాతో ఓడి రజత పతకం సాధించిన అనంతరం.. తన ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. “ఈ రోజు నేను ఆడిన తీరుతో అస్సలు సంతృప్తిగా లేను. ఇంతకంటే చాలా మెరుగ్గా ఆడి ఉండాల్సింది” అని అనాహత్ సింగ్ అన్నారు. సెమీఫైనల్లో సాధించిన విజయం ఇచ్చిన ఉత్సాహం కారణంగా ఫైనల్‌లో సరిగ్గా దృష్టి పెట్టలేకపోయానేమోనని పేర్కొన్నారు. అయితే ఊహించిన దానికంటే మెరుగైన ఫలితంగా రజత పతకం దక్కడం ఆనందంగా ఉందని అనాహత్ తెలిపారు. అదే సమయంలో తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయాననే బాధ ఉందన్నారు. ఈ ఓటమితో స్వర్ణ పతకంతో పాటు 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోయారు.

అగ్రశ్రేణి ఆటగాళ్లతో తలపడేటప్పుడు ఎదురయ్యే ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో ఈ టోర్నీ ద్వారా నేర్చుకున్నానని అనాహత్ చెప్పారు. ప్రపంచ ఐదో ర్యాంకర్ శివసంగరితో ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించానని, తన లోపాలను సరిదిద్దుకుని భవిష్యత్తులో మరింత మెరుగ్గా రాణిస్తానని తెలిపారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న టీమ్ ఈవెంట్‌పైనే ఇక తమ దృష్టి ఉందని అనాహత్ పేర్కొన్నారు. జోష్నా చిన్నప్ప, తన్వి ఖన్నా వంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్న తమ జట్టు బలంగా ఉందని, అందరూ కలిసికట్టుగా రాణించి పతకం సాధించేందుకు ప్రయత్నిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>