తగ్గిన ఉగ్రవాదుల రిక్రూట్మెంట్: అమిత్ షా

కలం, వెబ్ డెస్క్: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల రిక్రూట్మెంట్ పూర్తిగా తగ్గిపోయిందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) స్పష్టం చేశారు. గడిచిన ఏడాది కాలంలో కశ్మీర్ యువకుల్లో ఒక్కరు కూడా ఉగ్రవాదం వైపు వెళ్లలేదన్నారు. ఢిల్లీలో ఎన్ఐఏ నిర్వహించిన రెండు రోజుల ఉగ్రవాదుల వ్యతిరేక సదస్సు ప్రారంభంలో అమిత్ షా మాట్లాడారు. కేంద్రం తీసుకుంటున్న కఠిన చర్యల కారణంగానే జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదం క్రమంగా తగ్గుతోందన్నారు. ఇటీవల ఎన్కౌంటర్ లో మరణించిన లష్కరే తోయిబాకు చెందిన లతీఫ్ భట్ చివరి వ్యక్తి అన్నారు.

ముందే అరెస్ట్ చేయాలి..

ఉగ్రదాడులు జరగకముందే అనుమానితులను గుర్తించి, వారిని వెంటనే అరెస్ట్ చేయడమే దర్యాప్తు సంస్థలకు అసలైన విజయమని అమిత్ షా పేర్కొన్నారు. ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందించేవారు కూడా ఉగ్రవాదులుగానే పరిగణించాలని.. వారి నెట్ వర్క్ పూర్తిగా కట్ చేయాలని పిలుపునిచ్చారు. 2019 నుంచి ఇప్పటివరకు 36 దేశాల నుంచి 303 మందిని భారత్ కు తీసుకొచ్చామన్నారు. వీరంతా డ్రగ్స్ సహా వివిధ నేరాలకు పాల్పడినవారని గుర్తు చేశారు. దర్యాప్తుల విషయంలో రాష్ట్ర ఏజెన్సీలతో కూడా సమన్వయం చేసుకోవాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>