హైదరాబాద్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా

కలం, వెబ్ డెస్క్ : కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) శనివారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. నగరానికి వచ్చిన అనంతరం ఆయన తెలంగాణ బీజేపీ కీలక నేతలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ భేటీలో రాబోయే జీహెచ్‌ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహాలతో పాటు రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది.

అనంతరం మరుసటి రోజు (ఆదివారం) ఆయన మెదక్ జిల్లా తూప్రాన్, కరీంనగర్‌‌లలో విస్తృతంగా పర్యటించనున్నారు. తూప్రాన్‌లో అమూల్ మిల్క్ చిల్లింగ్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయడంతో పాటు, కరీంనగర్‌లోని ప్రతిమ మెడికల్ కాలేజ్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొని పలు అభివృధ్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>