అర్ధరాత్రి వరకు లౌడ్ మ్యూజిక్‌.. అల్లు శిరీష్ ఫిర్యాదు

కలం, వెబ్ డెస్క్ : సినీ నటుడు అల్లు శిరీష్‌(Allu Sirish) హైదరాబాద్‌ సిటీ పోలీసులను ఆశ్రయించారు. షేక్‌పేటలోని అపర్ణ వన్‌లో నివసిస్తున్న ఆయన.. వినోబా నగర్‌లోని (Vinobha Nagar) హనుమాన్ ఆలయం వద్ద అర్ధరాత్రి వరకు అధిక శబ్దంతో మ్యూజిక్‌ ప్లే చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. గత కొన్ని రోజులుగా అర్ధరాత్రి 2, 3 గంటల వరకు పరిమితికి మించి భారీ శబ్దాలతో మ్యూజిక్ ప్లే చేస్తున్నట్లు  తెలిపారు. ఈ విషయంపై ఫిల్మ్‌నగర్ పోలీస్‌ స్టేషన్‌లో ఇప్పటికే ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. అయితే గణేష్ నిమజ్జనం సందర్భంగా సెప్టెంబర్ 25 వరకు భరించాలని పోలీసులు సూచించినట్లు తెలిపారు.

గణేష్‌ ఉత్సవాలు పూర్తయినప్పటికీ అధిక శబ్దాలతో మ్యూజిక్‌ కొనసాగుతోందని అల్లు శిరీష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అపర్ణ వన్‌లోని వృద్ధులు, చిన్నారులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గతంలోనూ పలుమార్లు ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. ఈ సమస్యపై వెంటనే దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌ సిటీ పోలీసులను శిరీష్ కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>