కలం, వెబ్ డెస్క్ : ప్యాసింజర్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఛత్తీస్ ఘడ్ లోని బిలాస్ పూర్ ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ సమయంలో అలయన్స్ విమానం టైర్ ఒక్కసారి పేలింది (Plane Tyre Bursts). దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విమానం సేఫ్ ల్యాండ్ కావడంతో 41 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ప్రయాణికులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

