బీర్ల అయిలయ్య ఇంట ఘనంగా వరలక్ష్మీ వ్రతం

కలం, యాదగిరిగుట్ట: వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య (MLA Beerla Ilaiah), ఆయన సతీమణి, బీర్ల ఫౌండేషన్ చైర్‌పర్సన్ బీర్ల అనిత హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తమ అధికారిక నివాసంలో శ్రీ వరలక్ష్మీ అమ్మవారిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు (Varalakshmi Puja) ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి శాస్త్రోక్తంగా పూజలు, అభిషేకాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సిరిసంపదలు, ఆనందం, శాంతి వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>