లెనిన్ రిజ‌ల్ట్‌.. క‌న్నీళ్లు పెట్టుకున్న అఖిల్‌!

క‌లం, వెబ్ డెస్క్‌: అక్కినేని అఖిల్ (Akhil Akkineni) హీరోగా న‌టించిన లేటెస్ట్ మూవీ లెనిన్ (Lenin) నేడు థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. ఫ‌స్ట్ షో నుంచే లెనిన్ పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. దీంతో ఎట్ట‌కేల‌కు అఖిల్ త‌న కెరీర్‌లో తొలి హిట్ అందుకున్నాడ‌ని అక్కినేని ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఈ సినిమాకు వ‌స్తున్న రెస్పాన్స్ ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేస్తూ మూవీ టీం అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో సంబ‌రాలు చేసుకుంది. ఈ సంద‌ర్భంగా ఏఎన్నార్ విగ్ర‌హం ముందు కేక్ క‌ట్ చేశారు. ఈ వేడుక‌ల‌కు నాగార్జున కూడా హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా అఖిల్ తీవ్ర భావోద్వేగానికి గుర‌య్యారు. నాగార్జున కాళ్ల‌ప‌డి, ఆయ‌న‌ను హ‌త్తుకొని క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. కొద్దిసేపు ఏడుస్తూనే ఉండిపోయాడు. కొడుకు తొలి హిట్ అందుకోవ‌డంతో నాగార్జున కూడా చాలా ఎమోష‌న‌ల్ అయ్యారు. అఖిల్ ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన ప‌దేళ్ల త‌ర్వాత తొలి క‌మ‌ర్షియ‌ల్ హిట్ అందుకున్నాడు. లెనిన్‌ సినిమాపై అక్కినేని ఫ్యాన్స్‌, నాగార్జున ఫ్యామిలీ బోలెడు ఆశ‌లు పెట్టుకున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్ర‌తి క్రాఫ్ట్ వ‌ర్క్‌ను నాగార్జున ద‌గ్గ‌రుండి చూసుకున్నార‌ని ఇండ‌స్ట్రీలో టాక్ వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు లెనిన్‌తో అఖిల్ హిట్ కొట్టాడ‌ని అక్కినేని ఫ్యామిలీ సంబరాలు చేసుకుంటోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>