జీతాల పెంపునకు అంగీకారం.. ఏఐటీయూసీ హర్షం

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ప్రభుత్వ ఆసుపత్రుల్లోని పారిశుద్ధ్య కాంట్రాక్ట్ కార్మికుల వేతనం రూ.20 వేలు పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించడంపై ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (AITUC)  నేతలు హర్షం వ్యక్తం చేశారు. కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని, కాలం చెల్లిన ఏజెన్సీలను రద్దు చేయాలంటూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఎనిమిది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఆందోళనను గురువారం విరమించింది. ఈ మేరకు రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రంగా అజ్మీరకి శాలువాలతో సత్కరించారు.

త్వరలోనే మరోసారి సమావేశం..

ఈ సందర్భంగా పి.సురేష్ మాట్లాడుతూ.. డీఎంఈ డాక్టర్ వాణితో జరిగిన చర్చలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య, పేషెంట్ కేర్,సెక్యూరిటీ, సూపర్వైజర్ కార్మికులకు రూ.11,500 జీతం నుంచి రూ.20,243 పెంచటానికి అంగీకరించారని తెలిపారు. ఈఎస్ఐ, పీఎఫ్ కట్ చేయాలని, కార్మికులతో పాటు యాజమాన్యం వాటా కూడా కలిపి కార్మికుల ఖాతాల్లో జమచేయాలన్నారు.

సంవత్సరానికి నాలుగు పండగ, నాలుగు జాతీయ, 20 రోజుల హాజరుకు ఒక రోజు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలన్నారు. సంవత్సరానికి 2 జతల యూనిఫారం, నెల జీతం బోనస్ గా చెల్లించాలనే అంశంపై త్వరలోనే సమావేశమవుతామన్నారు. ఆసుపత్రి బ్రాంచ్ యూనియన్ నాయకులు బి.చెన్నయ్య, జే.నరసింహ, రాఘవేందర్, నైసన్, రామకృష్ణ, యాదయ్య, అంజయ్య, యాదగిరి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>