సోప్ యాడ్‌లో లక్ష్మీ పూజ: వివాదంలో ప్రముఖ సినీ నటుడు!

కలం, వెబ్ డెస్క్‌ : ప్రముఖ హాస్యనటుడు అలీ (Actor Ali) తాజాగా ఒక సబ్బు ప్రకటన విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఒక సబ్బుకు లక్ష్మీ పూజ చేస్తూ బ్యాక్‌గ్రౌండ్‌లో దైవ మంత్రాలు వచ్చేలా చిత్రీకరించిన ఈ ప్రకటనపై హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. దైవప్రార్థనను వ్యాపార ప్రకటనలకు వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అలీని బాయ్‌కాట్ చేయాలనే డిమాండ్ సోషల్ మీడియాలో ఊపందుకుంది.

ఈ వివాదం మరింత ముదరడంతో నటుడు అలీ తక్షణమే స్పందించి బహిరంగ క్షమాపణలు తెలియజేశారు. గతంలో తాను నటించిన ఒక సినిమాలోని సన్నివేశాన్ని ఆధారంగా చేసుకుని ఈ యాడ్‌ను రూపొందించారని ఆయన వివరణ ఇచ్చారు. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం తనకు లేదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>