కలం, వెబ్ డెస్క్: ఏపీలోని ప్రకాశం (Prakasam)జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సంచలనం కలిగించిన వ్యవసాయాధికారి శ్రీహరి హత్య కేసులో నిందితుడిగా ఉన్న అతడి సొంత బావమరిది హరికృష్ణ కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్యా పిల్లలతో కలిసి సింగరాయకొండలో గూడ్స్ రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ మేరకు రైల్వే పోలీసులకు సమాచారం అందడంతో.. ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఆస్తి కోసం సొంత బావనే హత్య..
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్న శ్రీహరిని ఆస్తి కోసం సొంత బావమరిది హరికృష్ణ కుక్కలను చంపే మందును ఇంజెక్షన్ల ద్వారా ఎక్కించి చంపేశాడు. గుండెపోటు అంటూ నాటకమాడినా.. పోలీస్ విచారణలో అసలు నిజం బయటపడింది. ఈ హత్యకు సహకరించిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేయగా.. పరారీలో ఉన్న హరికృష్ణ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే సింగరాయకొండలో కుటుంబంతో సహా నలుగురు సూసైడ్ చేసుకోవడం సంచలనంగా మారింది.
Read Also: ఒక్క రూపాయి ఖర్చు లేకుండా సివిల్స్ కోచింగ్!
Follow Us On: Instagram

