పెట్రోల్ బంకు అనుమతులకు లంచం డిమాండ్.. అధికారి అరెస్ట్!

కలం, వెబ్ డెస్క్ : యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లా కలెక్టరేట్ వేదికగా అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మెరుపు దాడి నిర్వహించారు. పెట్రోల్ బంకు అనుమతుల వ్యవహారంలో లంచం డిమాండ్ చేసిన లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లును ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

బాధితుడు చింతల యాదగిరి నుంచి మొదటి విడతగా రూ.20 వేల లంచం డబ్బులు స్వీకరిస్తుండగా అధికారులు దాడులు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. పెట్రోల్ బంకు మంజూరుకు సంబంధించి నిబంధనల ప్రకారం ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉండగా, సదరు అధికారి డబ్బులు ఆశించినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>