ఏసీబీకి చిక్కిన గ్రామ పంచాయతీ అధికారి

కలం, కరీంనగర్ బ్యూరో: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి (Metpally) మండలం ఆత్మకూరులో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. పట్టాదారు పాస్ పుస్తకంలో పేరు సవరించేందుకు లంచం తీసుకుంటుండగా గ్రామ పంచాయతీ అధికారి రాజేష్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బాధిత రైతు నుంచి రూ.5 వేలు లంచం డిమాండ్ చేయడంతో, ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ముందస్తు వ్యూహం ప్రకారం, గురువారం రైతు నుంచి రాజేష్ డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేశామని, కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>