ఇండియాను గెలిపించింది ఆ ఒక్కడే: ఆకాశ్ చోప్రా

కలం, స్పోర్ట్స్​ : టీ20 వరల్డ్‌కప్ 2026 సెమీఫైనల్‌లో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ మరోసారి మ్యాచ్ దిశను మార్చిందని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా (Aakash Chopra) అభిప్రాయపడ్డాడు. బుమ్రా లేకపోతే భారత్ ఈ మ్యాచ్ గెలవడం కష్టమై ఉండేదని ఆయన పేర్కొన్నాడు. ముంబైలో జరిగిన రెండో సెమీఫైనల్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 253 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన ఇంగ్లండ్ 246/7 వద్ద ఆగిపోయింది. దీంతో భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో బుమ్రా నాలుగు ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి ఒక కీలక వికెట్ తీశాడు. ముఖ్యంగా కఠిన సమయాల్లో ఓవర్లు వేస్తూ పరుగులను నియంత్రించాడని చోప్రా వివరించాడు.

పవర్‌ప్లే, మధ్య ఓవర్లు, చివరి ఓవర్లు అన్నీ బుమ్రానే బౌలింగ్ చేసినట్లు ఆయన గుర్తుచేశాడు. మ్యాచ్‌లో ఒక బౌలింగ్ స్పెల్ ఫలితాన్ని మార్చేస్తుందని చోప్రా (Aakash Chopra) వ్యాఖ్యానించాడు. బుమ్రా మొదటి బంతికే హ్యారీ బ్రుక్ వికెట్ పడగొట్టడం మ్యాచ్ మలుపు తిప్పిందని చెప్పాడు. అలాగే 16వ ఓవర్‌లో కేవలం 8 పరుగులు, 18వ ఓవర్‌లో 6 పరుగులు మాత్రమే ఇవ్వడం కూడా కీలకమైందని తెలిపాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న సంజూ శాంసన్ కూడా బుమ్రానే ఆ అవార్డుకు అర్హుడని మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించినట్లు చోప్రా గుర్తు చేశాడు. బుమ్రా కీలక సమయంలో జట్టుకు ఎంత ముఖ్యమో ఈ మ్యాచ్ మరోసారి చూపించిందని ఆయన అభిప్రాయపడ్డాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>