Mobile Popup Ad
Mobile Popup Ad

హన్మకొండలో రెచ్చిపోయిన చైన్‌ స్నాచ‌ర్లు!

క‌లం, వెబ్ డెస్క్‌: హన్మకొండలో చైన్ స్నాచ‌ర్లు (Hanumakonda Chain Snatchers) రెచ్చిపోతున్నారు. ఒంట‌రి మ‌హిళ‌లే ల‌క్ష్యంగా దోపిడీల‌కు పాల్ప‌డుతున్నారు. రోడ్లు, ఇండ్లు ఎక్క‌డా వ‌ద‌ల‌కుండా చోరీలు చేస్తున్నారు. తాజాగా శుక్ర‌వారం ఉద‌యం హన్మకొండలో మ‌రో చైన్ స్నాచింగ్ ఘ‌ట‌న జ‌రిగింది. మామిండ్ల న‌వ్య అనే మ‌హిళ తెల్ల‌వారుజామున‌ ఇంటి ముందు ముగ్గు వేస్తున్నప్పుడు ఓ వ్య‌క్తి ప‌క్క‌నే రోడ్డు మీద‌ న‌డుచుకుంటూ వెళ్తున్నాడు. న‌వ్య అత‌డిని గ‌మ‌నించ‌లేదు. వెంట‌నే స‌ద‌రు వ్య‌క్తి న‌వ్య‌ మెడలోని బంగారు చైన్ లాక్కొని ప‌రార‌య్యాడు.

ఒక్క‌సారిగా షాక్‌కు గురైన న‌వ్య తేరుకొని అరుస్తూ అత‌డిని వెంబ‌డించింది. ప‌క్క‌నే సందులో మ‌రో వ్య‌క్తి బైక్ స్టార్ట్ చేసి రెడీగా ఉన్నాడు. చైన్ చోరీ చేసిన దొంగ వెళ్లి ఆ బైక్ ఎక్కేశాడు. న‌వ్య ఎంత ప్ర‌య‌త్నించినా వాళ్ల‌ను ప‌ట్టుకోలేక‌పోయింది. చైన్ దొంగ‌త‌నంపై సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>