కలం డెస్క్ : మక్కా దర్శనం అనంతరం మదీనాలో (Madina Bus Accident) జరిగిన బస్సు ప్రమాదంలో మృతుల (Deceased), క్షతగాత్రుల (Injured) కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియాను (Exgratia) విడుదల చేసింది. ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి రూ. 3.07 కోట్లను విడుదల చేస్తున్నట్లు సీఎంఓ కార్యాలయం తెలిపింది. మృతుల కుటుంబాలతో పాటు తీవ్రంగా గాయపడిన బాధితులకు కూడా ఈ సాయం అందనున్నది. మృతుల కుటుంబాలకు తలా రూ. 5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియాను రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లోనే ప్రకటించింది.
దీనికి తోడు తీవ్రంగా గాయపడినవారికి సైతం అందజేయనున్నది. గత నెల 9న ఇక్కడి నుంచి 45 మంది మక్కా (Mecca) దర్శనం కోసం వెళ్ళి బస్సులో 17న మదీనాకు వెళ్ళినప్పుడు జరిగిన ప్రమాదంలో(Madina Bus Accident) 45 మంది మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మరణించారు. ఇప్పుడు వీరందరికీ ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ నుంచి ఎక్స్ గ్రేషియాను విడుదల చేసింది.
Read Also: వరి రైతులకు సర్కార్ గుడ్ న్యూస్
Follow Us On: Instagram


