ఇరాన్ తో చర్చలకు సిద్ధం.. అమెరికా ప్రకటన

కలం, వెబ్ డెస్క్ : ఇరాన్, అమెరికా యుద్ధం వల్ల ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా యుద్ధం వల్ల హార్మూజ్ జలసంధి మూసివేయడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. నిత్యావసర ధరలు కూడా అమాంతం పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఊరట కలిగే వార్త అందుతోంది. అణు కార్యక్రమానికి ( Iran US Nuclear Talks) సంబంధించిన కొన్ని అంశాలపై చర్చలకు ఇరాన్ సిద్ధమైందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రకటించారు.

ఈ సందర్భంగా గతంతో చర్చించేందుకు నిరాకరించిన అంశాలపైన ఇరాన్ ప్రస్తుతం ముందుకు రావడం కొత్త పరిణామంగా భావిస్తున్నామని చెప్పుకొచ్చారు. అయితే సైనిక చర్యల అనంతరం కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినప్పటికీ, హార్మూజ్ జలసంధిని తెరవాలన్న హామీని ఇరాన్ నిలబెట్టుకోలేదని రూబియో ఆరోపించారు. దీనికి స్పతిస్పందనగానే అమెరికా ఇరాన్ నౌకా రవాణాపై కఠిన చర్యలు తీసుకుందని స్పష్టం చేశారు. ఇటీవల అమెరికా జరిపిన సైనిక చర్యల కారణంగా ఇరాన్ సైనిక సామర్థ్యాలు గణనీయంగా దెబ్బతీన్నాయని చెప్పారు. చర్చల విషయంపై ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>