కలం, వెబ్ డెస్క్ : వేసవి కాలంలో వరుస అగ్ని ప్రమాదాలు ప్రజలను కలవరపెడుతున్నాయి. ఎప్పుడు, ఎలా అగ్ని ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కర్ణాటకలోని బెంగళూరు (Bengaluru Fire Accident) రింగ్ రోడ్డులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. చిత్రకళా పాఠశాలలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో అక్కడ దట్టమైన పొగ అలుముకుంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
అయితే వేసవి సెలవుల కారణంగా విద్యార్థులు ఎవ్వరూ పాఠశాలలో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్ని ప్రమాద ఘటన సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పాఠశాల భవనంపై అంతస్తులో మంటలు చెలరేగినట్లు సమాచారం అందుతోంది.
Read Also: గ్రీన్‌కార్డుల విషయంలో ట్రంప్ సర్కార్ యూటర్న్!
Follow Us On : WhatsApp

