Mobile Popup Ad
Mobile Popup Ad

కోహిర్‌లో గాలిదుమారం.. అరటి తోట నేలమట్టం

కలం, మెదక్ బ్యూరో : సంగారెడ్డి (Sangareddy)  జిల్లా కోహిర్ (Kohir) మండలం పిచరాగడి గ్రామంలో గాలిదుమారం తీవ్ర నష్టం కలిగించింది. ఒక్కసారిగా వీచిన ఈదురు గాలులతో రైతు రాంరెడ్డికి చెందిన అరటి తోట పూర్తిగా నేలమట్టమైంది. సుమారు మూడు ఎకరాలలో సాగు చేసిన ఈ తోట మరో నెల రోజులలో కోతకు సిద్ధంగా ఉండగా, ప్రకృతి విపత్తుతో పూర్తిగా నష్టపోయింది. గాలిదుమారం మూలంగా సుమారు 5 లక్షల రూపాయల మేర నష్టం జరిగినట్లు రైతు రాంరెడ్డి తెలిపాడు. తనకు జరిగిన నష్టానికి ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని రైతు రాంరెడ్డి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>