Mobile Popup Ad
Mobile Popup Ad

రైలు ప్రమాదం: ఎనిమిది మంది దుర్మరణం

కలం, వెబ్‌ డెస్క్‌ : థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌ (Bangkok)లో శనివారం మధ్యాహ్నం ఒక రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో నిండిన ఒక ప్యాసింజర్ బస్సు సరిగ్గా రైల్వే పట్టాల మీదే ఆగిపోయింది. అదే సమయంలో వేగంగా దూసుకొచ్చిన గూడ్స్ రైలు ఆ బస్సును బలంగా ఢీకొట్టింది.

ట్రైన్ ఢీకొట్టిన మరుక్షణమే అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన రెస్క్యూ సిబ్బంది, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

రైలు ఢీకొట్టిన వేగానికి బస్సు కొట్టుకుపోతూ అవతల వైపు ఆగి ఉన్న మరికొన్ని వాహనాలను కూడా ఢీకొట్టింది. దీంతో ఆ వాహనాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలపై స్థానిక అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>