Mobile Popup Ad
Mobile Popup Ad

విద్యార్థి సాత్విక్ ను అభినందించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

కలం, నిజామాబాద్ బ్యూరో: ఒలంపియాడ్ సైన్స్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సాత్విక్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ (Dhanpal Surya Narayana) తెలిపారు. ఇందూరు నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం విద్యార్థిని దన్ పాల్ అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి పాఠశాల విద్యతో పాటు ఇతర సబ్జెక్టుల విజ్ఞానాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అలాగే క్రీడల్లోనూ తర్ఫీదు పొందాలని సూచించారు. వేసవి సెలవులను వృధా చేయకుండా ప్రతి విద్యార్థి ఏదో ఒక రంగంలో శిక్షణ పొందాలన్నారు. పేద విద్యార్థులకు తన వంతు ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. తమ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థి సాత్విక్ ఉత్తమ ప్రతిభను కనబరచడం సంతోషంగా ఉందని చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>