శంషాబాద్ వస్తున్న విమానం.. ఏ క్షణమైనా పేల్చేస్తామని బెదిరింపులు..!

కలం, వెబ్ డెస్క్ : మలేసియా (Malaysia) నుంచి శంషాబాద్ వస్తున్న ఎయిర్ ఏషియా విమానానికి బాంబు బెదిరింపులు (Bomb Threat) రావడం తీవ్ర కలకలం సృష్టించింది. విమానాన్ని ఎయిర్ పోర్టుకు చేరుకునే లోపే ఏ క్షణమైనా పేల్చేస్తామని గుర్తుతెలియని దుండగులు మెయిల్ చేశారు. దీంతో శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సెక్యూరిటీ సిబ్బంది, బాంబు స్క్వాడ్ రెస్పాన్స్ టీమ్స్ వెంటనే రంగంలోకి దిగాయి.

ముందస్తు భద్రతా చర్యల చేపట్టిన వేళ తీవ్ర ఉత్కంఠ నడుమ శంషాబాద్ రన్‌వే పై విమానం క్షేమంగా ల్యాండ్ అయింది. విమానం ల్యాండింగ్ పూర్తి కాగానే ప్రయాణికులను హుటాహుటిన కిందికి దించారు. బాంబు స్క్వాడ్ టీమ్స్ లగేజీలను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఈ ఘటనలో ఎలాంటి అపాయం కలగకపోవడంతో అందరూ ఊపీరి పీల్చుకున్నారు. అయితే ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. ప్రస్తుతం ఎయిర్ పోర్ట్ పరిసరాల్లో భయాందోళన వాతావరణం ఉంది.

Read Also: బోరుబావిలో పడ్డ మనవడు.. కాపాడే ప్రయత్నంలో తాత మృతి!

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>