Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రధాని మోదీ కీలక నిర్ణయం.. కాన్వాయ్ సంఖ్య తగ్గించాలని ఆదేశాలు!

కలం, వెబ్ డెస్క్: ప్రధాని మోదీ (PM Modi) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను వెంటనే తగ్గించాలని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్‌(ఎస్పీజీ)కు ఆదేశాలు జారీ చేశారు. సగం వరకు పెట్రోల్ వాహనాలను తగ్గించి.. వాటి స్థానంలో ఎలక్ట్రానిక్ కార్లను ప్రవేశపెట్టాలని సూచించారు. ప్రధాని ఆదేశాలతో కాన్వాయ్‌లో మార్పులు చేర్పులు చేసేందుకు ఎస్పీజీ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే ప్రధాని భద్రతకు భంగం వాటిల్లకుండానే.. ఇంటెలిజెన్స్ అధికారుల సూచనల మేరకు త్వరలోనే ఈవీ వాహనాలు కాన్వాయ్‌లో చేరే అవకాశం ఉందని సమాచారం.

పెట్రోల్ వాడకం తగ్గించాలనే..

దేశ ప్రజలు ఇక నుంచి పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలని ఇటీవలే ప్రధాని మోదీ పేర్కొనడం పెద్ద చర్చకు దారి తీస్తోంది. ఈ క్రమంలోనే.. ప్రధాని తన కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను తగ్గించాలని ఆదేశించడం ఆసక్తికరంగా మారింది. ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం కూడా ఇదే మొదటిసారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం పరిణామాలను గమనిస్తే.. రాబోయే రోజుల్లో మరిన్ని కఠిన నిర్ణయాలు ఉండే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>