కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ (Bandi Bhagirath) ఆచూకీ కనిపించడం లేదంటూ వెలిసిన పోస్టర్లు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. శేరిలింగంపల్లి, గచ్చిబౌలి వంటి కీలక ప్రాంతాల్లో ఈ పోస్టర్లు దర్శనమిచ్చాయి. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న భగీరథ్ ప్రస్తుతం ఎక్కడున్నారో ఎవరికీ తెలియడం లేదని వాటి సారాంశం.
ఒకవేళ భగీరథ్ ఆచూకీ తెలిస్తే వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందించాలని ఆ పోస్టర్లలో పేర్కొన్నారు. ఈ ఘటన నగరవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాజకీయ వర్గాల్లో ఈ పోస్టర్ల వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు వీటిని ఎవరు అంటించారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం ఈ ఫోటోలు వైరల్ అవుతుండటంతో ఉత్కంఠ నెలకొంది.

