హరీశ్ రావు రైతులను రెచ్చగొడుతున్నారు.. కోదండ రెడ్డి ఫైర్

క‌లం మెద‌క్ బ్యూరో: మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) రైతులను రెచ్చగొడుతున్నాడని రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి (Kodanda Reddy) మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులకు భ‌రోసా ఇవ్వాలి. కానీ, నీచ రాజకీయాలు చేయొద్దని అన్నారు. మంగళవారం మెద‌క్ జిల్లా చేగుంట మండలం కర్నాల్ ప‌ల్లి గ్రామంలో ఐకేపీ కొనుగోలు సెంటర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా కోదండ రెడ్డి మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల వ‌ద్ద ఏవైనా సమస్యలుంటే.. ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. కోనుగోలు సమస్యల‌ను పరిష్కరించడం కోసం రాష్ట్ర రైతు కమిషన్ ఉంద‌ని గుర్తుచేశారు.

ధాన్యం కొనుగోళ్లపై రాజకీయం చేయొద్దని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని రెండు రోజుల్లో తరలించాలని ఆయన అధికారులను ఆదేశించారు. కోదండ రెడ్డి (Kodanda Reddy) వెంట రైతు కమిషన్ మెంబర్ భవాని రెడ్డి, దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.

Read Also:  నీట్ పరీక్ష రద్దుపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>