Mobile Popup Ad
Mobile Popup Ad

సీఎంగా విజయ్.. వీళ్లే కొత్త మంత్రులు?

కలం, వెబ్ డెస్క్: తమిళనాడు నూతన సీఎంగా మరికాసేపట్లో విజయ్ (CM Vijay) ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. పలువురు మంత్రులుగా ప్రమాణం చేయబోతున్నారు. దీంతో వారికి ఏయే శాఖలు ఇవ్వబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టీవీకే వర్గాల సమాచారం ప్రకారం.. కొందరి పేర్లు, వారికి కేటాయించే శాఖల వివరాలు బయటకొచ్చాయి. అత్యంత కీలకమైన హోం, పోలీస్ శాఖను విజయ్ తన వద్దనే ఉంచుకునే అవకాశం ఉంది. మంత్రి వర్గ విస్తరణ వరకు మంత్రులకు కేటాయించని శాఖలు కూడా విజయ్ వద్దనే ఉండనున్నాయి.

సెంగొట్టయ్యన్‌కు పబ్లిక్ వర్క్స్ శాఖ..?

టీవీకే పార్టీ, ప్రభుత్వంలో అత్యంత కీలకమైన నేతగా భావిస్తున్న కే.ఏ.సెంగొట్టయ్యన్‌కు పబ్లిక్ వర్క్స్ శాఖ కేటాయించబోతున్నట్లు సమాచారం. బస్సీ ఆనంద్‌కు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ, వెంకట్ రామన్‌కు విద్యా శాఖ, ఆధవ్ అర్జునకు యువజన, క్రీడాశాఖలు, రాజ్‌మోహన్‌కు ఆది ద్రావిడ సంక్షేమ శాఖ, ముస్తఫాకు మైనారిటీ వెల్ఫేర్ శాఖ, అరుణ్ రాజ్‌కు పశుసంవర్ధక, పాల అభివృద్ధి శాఖలు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, చివరి నిమిషంలో ఈ శాఖల్లో మార్పులు ఉండే అవకాశం కూడా లేకపోలేదు. సాయంత్రానికి పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>