Mobile Popup Ad
Mobile Popup Ad

కర్ణాటకలో షాకింగ్‌ ఘటన : పెళ్లి చేసుకున్న అక్కా తమ్ముడు

కలం, వెబ్‌ డెస్క్ : కర్ణాటక (Karnataka) రాష్ట్రంలోని బెంగుళూరు (Bengaluru) రూరల్ పరిధిలో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. దేవానహళ్లికి చెందిన శశికళ అనే యువతి వరుసకు తమ్ముడయ్యే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. హోసకోటలో నివసిస్తున్న తన పెద్దమ్మ కుమారుడు ప్రవీణ్‌తో ఆమె గత మూడేళ్లుగా ప్రేమాయణం సాగిస్తోంది. వీరిద్దరూ సన్నిహిత బంధువులు కావడంతో వివాహానికి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు.

ఈ క్రమంలో శశికళ తల్లిదండ్రులు ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయించారు. తమ ప్రేమను కాపాడుకునేందుకు శశికళ, ప్రవీణ్ ఇళ్ల నుండి పారిపోయి రహస్యంగా వివాహం చేసుకున్నారు. తమ వివాహం వల్ల తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని భావించిన ఈ జంట రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించింది. వరుసకు అక్కాతమ్ములైన వీరు వివాహం చేసుకోవడం స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది.

Read Also: విజయ్‌కి మరో హీరోయిన్ మద్దతు..

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>