Mobile Popup Ad
Mobile Popup Ad

షాకింగ్.. ఖాకీలపైనే కత్తి ఎత్తిన మందు బాబు!

కలం, ఖమ్మం బ్యూరో: ఖాకీలపైనే కత్తి ఎత్తిన మందు బాబును పోలీసులు గురువారం కోర్టులో హాజరు పరచి రిమాండ్ కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. ​నిన్న సాయంత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు (Manuguru) పోలీసులు స్థానిక సమ్మక్క సారక్క ఆలయం వద్ద ఎప్పటిలాగే వాహన తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో తొగ్గూడెం వైపు నుంచి బైక్‌పై వస్తున్న సోలేం నాగేశ్వరరావును పోలీసులు ఆపి బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించగా, ఏకంగా 80 BAC శాతం నమోదైంది. నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రమాదం జరగ కూడదనే ఉద్దేశంతో అతడిని జాగ్రత్తగా ఇంటికి పంపించి వేశారు.

ఇంటికి వెళ్లిన వ్యక్తి కాసేపటికే తన వెంట కత్తి తీసుకుని తిరిగి ఘటనా స్థలానికి చేరుకున్నాడు. “నాకు టెస్ట్ చేస్తారా?” అంటూ కేకలు వేస్తూ విధుల్లో ఉన్న పోలీసులపైకి కత్తితో దూసుకెళ్లాడు. అదృష్టవశాత్తూ పోలీసులు అప్రమత్తంగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడం, హత్యాయత్నం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>