Mobile Popup Ad
Mobile Popup Ad

సువేందు పీఏ మర్డర్: వెలుగులోకి సంచలన నిజాలు

కలం, నేషనల్ డెస్క్ : Suvendu Adhikari PA | వెస్ట్ బెంగాల్‌లో రాజకీయ హత్యల పరంపర కలకలం రేపుతున్నది. తాజాగా బీజేపీ కార్యకర్త చందర్‌నాథ్ రథ్ హత్యపై ఆయన తల్లి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. భవానీపూర్ నియోజకవర్గంలో సీఎం మమతా బెనర్జీ ఓటమికి ప్రతీకారంగానే తన కుమారుడిని పొట్టనబెట్టుకున్నారని ఆమె కన్నీరుమున్నీరయ్యారు. బెంగాల్ ఎన్నికల ఫలితాల అనంతరం జరుగుతున్న హింసాత్మక ఘటనల్లో భాగంగానే ఈ హత్య జరిగిందని ఆరోపించారు. “భవానీపూర్‌లో ఓటమిని జీర్ణించుకోలేక, ప్రత్యర్థులే లక్ష్యంగా అధికార పార్టీ వారు ఈ దాడులకు పాల్పడుతున్నారు. నా కొడుకు చావుకు ఆమె ఓటమే ప్రధాన కారణం” అని చందర్‌నాథ్ తల్లి మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతున్నది. అయితే, స్థానిక పోలీసులపై నమ్మకం లేదని, కేంద్ర సంస్థలతో దర్యాప్తు జరిపించాలని బాధితుడి తల్లి డిమాండ్ చేస్తున్నారు.

చందర్నాథ్ రథ్ మృతిపై తల్లి ఆవేదన

బీజేపీ కార్యకర్త చందర్‌నాథ్ రథ్ హత్యపై ఆయన తల్లి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. భవానీపూర్ నియోజకవర్గంలో సీఎం మమతా బెనర్జీ ఓటమికి ప్రతీకారంగానే తన కుమారుడిని పొట్టనబెట్టుకున్నారని ఆమె కన్నీరుమున్నీరయ్యారు. బెంగాల్ ఎన్నికల ఫలితాల అనంతరం జరుగుతున్న హింసాత్మక ఘటనల్లో భాగంగానే ఈ హత్య జరిగిందని ఆరోపించారు. “భవానీపూర్‌లో ఓటమిని జీర్ణించుకోలేక, ప్రత్యర్థులే లక్ష్యంగా అధికార పార్టీ వారు ఈ దాడులకు పాల్పడుతున్నారు. నా కొడుకు చావుకు ఆమె ఓటమే ప్రధాన కారణం” అని చందర్‌నాథ్ తల్లి మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతున్నది. అయితే, స్థానిక పోలీసులపై నమ్మకం లేదని, కేంద్ర సంస్థలతో దర్యాప్తు జరిపించాలని బాధితుడి తల్లి డిమాండ్ చేస్తున్నారు.

హత్యను తీవ్రంగా ఖండిస్తున్న – టీఎంసీ ఎంపీ

సువేందు అధికారి పీఏ చందర్‌నాథ్ రథ్ హత్యపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సీనియర్ నాయకుడు, ఎంపీ సౌగతా రాయ్ స్పందించారు. హత్యను ఆయన తీవ్రంగా ఖండిస్తూ.. బాధ్యులైన వారిపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సౌగతా రాయ్.. మధ్యమ్‌గ్రామ్‌లో జరిగిన ఈ హత్య అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి హింసాత్మక ఘటనలకు తావులేదని స్పష్టం చేశారు. ఈ కేసులో నిజానిజాలు బయటకు రావాలని, ఈ విచారణ నిష్పక్షపాతంగా జరగాలని కోరారు. అంతేకాకుండా, ఈ హత్యపై కోర్టు పర్యవేక్షణలో సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేయడం గమనార్హం.

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>