కలం, వెబ్ డెస్క్ : రాజధాని లేని రాష్ట్రంగా అవమానాలు ఎదుర్కున్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం విజయవాడ (Vijayawada)లో అమరజీవి పొట్టి శ్రీరాములు (Potti Sriramulu) ఆత్మార్పణ దినం కార్యక్రమంలో సీఎం ప్రసంగించారు. గత పాలకులు మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు జాతి గుర్తింపు కోసం పొట్టి శ్రీరాములు పోరాడారని కొనియాడారు. ఆయన జీవితంలో ఎన్నో అవమానాలు ఎదుర్కున్నా నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడి ప్రాణత్యాగం చేశారన్నారు. పొట్టి శ్రీరాములు మరణంతో తెలుగు వాళ్లు బయటకు వచ్చి పోరాటం చేశారని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
Read Also: ఏఐ వినియోగంతో జాగ్రత్త.. పోలీసుల హెచ్చరిక
Follow Us On: Pinterest


