Mobile Popup Ad
Mobile Popup Ad

ఆపరేషన్ సిందూర్‌కు ఏడాది.. వీడియో పంచుకున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్

కలం, వెబ్ డెస్క్: జమ్మూకశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడికి ప్రతిదాడిగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ (Operation Sindoor)కు ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దేశ ప్రజలతో స్పెషల్ వీడియోను పంచుకుంది. భారత్ ప్రతి ఉగ్రవాదిని, వారికి అండగా నిలిచినవారిని గుర్తించి, వెంబడించి, శిక్షిస్తుందని ప్రధాని మోదీ హెచ్చరిస్తున్న వీడియోను రిలీజ్ చేసింది. భారత్ ఏదీ మర్చిపోదు.. దేనిని క్షమించదు అంటూ భారత వైమానిక దళం పేర్కొంది.

పహల్గాంలో గతేడాది ఏప్రిల్ 22న పర్యాటకులపై సైనికుల వేషధారణలో వచ్చి, ఆధునిక ఆయుధాలతో పర్యాటకులపై భీకర కాల్పులు (Pahalgam Terror Attack) జరిపారు. ముస్లింవా, హిందువా అని అడుగుతూ వెతికివెతికి చంపారు. మగవారి బట్టలు విప్పి హిందువేనని తేల్చిన తర్వాతే తుపాకులతో కాల్చి చంపారు. కలిమా చదివితే ముస్లిం వ్యక్తి అని గుర్తించి విడిచిపెట్టారు. ఈ పాశవిక దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలకు దేశం మొత్తం మండిపడింది. కర్ణాటకకు చెందిన ఓ అనే మహిళ.. తన భర్తను కళ్ళముందే కాల్చి చంపడాన్ని చూసి తీవ్ర మనోవేదనకు గురయ్యారు. తమ భర్తతో పాటు తనను, తన కొడుకును చంపేయమని అన్నారు. దీంతో పాకిస్తాన్ ఉగ్రవాదులు వారిని చంపేయకుండా వదిలిపెట్టి.. మీరు ప్రధాని మోదీకి ఈ దాడి గురించి చెప్పండి అంటూ దురుసుగా మాట్లాడాడు. ఈ ఘటనతో భారత్, పాక్లల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆపరేషన్ సిందూర్ విషయంలో భారత ప్రజలందరూ ఒకేతాటి పైకి వచ్చి, భారత సైన్యానికి కొండంత అడంగా నిలిచారు. ఈ దాడిని దేశం మొత్తం తీవ్రంగా ఖండించింది.

పహల్గాం టెర్రర్ అటాక్ కు ప్రతిదాడిగా కేంద్రంలోకి బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ ని ప్రకటించింది. భారతదేశ హిందూ మహిళల సౌభాగ్యానికి ప్రతీక అయినా సింధూరాన్ని హరించి వేసినందుకుగాను ఈ పేరుతో భారత్ ప్రతిదాడులు చేపట్టింది. 2025 మే 7 న భారతదేశం పాకిస్తాన్‌పై ఆపరేషన్ సిందూర్ అనే పేరుతో క్షిపణి దాడులు నిర్వహించింది. 2025 మే 7 న భారతదేశం పాకిస్తాన్‌పై ఆపరేషన్ సిందూర్ అనే పేరుతో క్షిపణి దాడులు నిర్వహించింది. పాకిస్తాన్ లోను, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోనూ ఇస్లామిక్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఈ భారీ ఆపరేషన్ చేపట్టింది. భారత్ చర్యలకు పాకిస్తాన్ గుండెల్లో భయం పుట్టింది. ఇండియన్ ఆర్మీ.. పాకిస్తాన్ స్థావరాలను ఎక్కడికక్కడ పేల్చేసింది. ఎక్కడికక్కడ ఉగ్రవాదులను మట్టుబెట్టింది. వందలాది మందిని దారుణంగా చంపేసింది. భారత్ ప్రతిదాడికి పాకిస్తాన్ అట్టడుకుపోయింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>