Mobile Popup Ad
Mobile Popup Ad

గవర్నర్‌కు విజయ్ లేఖ.. టీవీకే రాజకీయ వ్యూహాలపై ఉత్కంఠ!

కలం, వెబ్ డెస్క్: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళ వెట్రి కళగం (TVK) అధినేత, నటుడు విజయ్ (Vijay) రాష్ట్ర గవర్నర్‌కు లేఖ రాశారు. రెండు వారాల్లో మెజారిటీ నిరూపిస్తామని.. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని కోరారు. పార్టీ స్థాపించిన తర్వాత రాజకీయ వ్యూహాలను వేగవంతం చేసిన విజయ్ కాసేపట్లో తన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన చర్చించనున్నారు. గవర్నర్‌కు లేఖ రాయడంతో ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>