కలం, వెబ్ డెస్క్ : చైనా (China)లోని హునాన్ ప్రావిన్స్‌లో గల ఒక బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోగా సుమారు 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే ప్రభుత్వం దాదాపు 500 మంది సహాయక సిబ్బందిని రంగంలోకి దించింది. ఫ్యాక్టరీలోని రెండు గిడ్డంగిల్లో భారీగా గన్ పౌడర్ నిల్వ ఉండటంతో మూడు కిలోమీటర్ల పరిధిలోని ప్రజలను అధికారులు అత్యవసరంగా ఖాళీ చేయిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా బాణాసంచా ఉత్పత్తికి కేంద్రమైన లియుయాంగ్ నగరంలోని హువాషెంగ్ ఫ్యాక్టరీలో ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం అక్కడ యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

