ఏపీ 10th రిజల్ట్స్ వచ్చేసాయ్: బాలికలదే హవా!

కలం, వెబ్‌ డెస్క్‌ : ఆంధ్రప్రదేశ్ పదో తరగతి విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాల (AP 10th Results) ను విడుదల చేశారు. ఈ ఏడాది మొత్తం 85.25 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి తమ సత్తా చాటారు. ప్రతి ఏటా లాగే ఈసారి కూడా ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించడం విశేషం.

విద్యార్థులు తమ ఫలితాలను వేగంగా చూసుకోవడానికి విద్యాశాఖ అత్యాధునిక వసతులను అందుబాటులోకి తెచ్చింది. అధికారిక వెబ్‌సైట్ www.results.bse.ap.gov.in ద్వారా మార్కుల జాబితాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ఈసారి సరికొత్తగా వాట్సాప్ సదుపాయాన్ని ప్రవేశపెట్టారు. 9552300009 నెంబర్‌కు ‘HI’ అని మెసేజ్ పంపడం ద్వారా క్షణాల్లో ఫలితాలను పొందే వీలుంది. ఉత్తీర్ణులైన విద్యార్థులకు, తల్లిదండ్రులకు విద్యాశాఖ అభినందనలు తెలియజేసింది.

Read Also: ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్ బిగ్ అప్డేట్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>