epaper
Friday, January 16, 2026
spot_img
epaper

ఆరు దేశాల్లో ధురంధర్ మూవీ బ్యాన్.. కారణమేంటి?

కలం, వెబ్‌డెస్క్: ఇటీవల విడుదలైన ధురంధర్ (Dhurandhar) సినిమా భారీ కలెక్షన్లు రాబడుతున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమాలోని కొన్ని అంశాలు వివాదాస్పదంగా మారినట్టు సమాచారం. పాకిస్థాన్‌ను ఈ సినిమాలో దోషిగా చూపించారంటూ కొన్ని గల్ఫ్ దేశాలు ఈ సినిమాను బ్యాన్ చేశాయి. ధురంధర్ చిత్రం డిసెంబర్ 5, 2025‌న విడుదలైంది. రణ్‌వీర్ సింగ్(Ranveer Singh), మాధవన్, అక్షయ్ ఖన్నా, ఆర్జున్ రాంపాల్, సారా అర్జున్ నటించారు.

ధురంధర్ విడుదలైన మొదటి వారంలోనే ఈ సినిమా 200 కోట్ల క్లబ్‌కు చేరుకుంటుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు రూ.180 కోట్లకు పైగా వసూలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రాన్ని ఆరు గల్ఫ్ దేశాల్లో(Gulf Countries) నిషేధించారు. బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో నిషేధించారు. అక్కడ ఏ థియేటర్లు కూడా దీన్ని నిషేధించారు.

ఎందుకు బ్యాన్/నిషేధం చేశారు?

ఈ సినిమా(Dhurandhar) పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఉందనే కారణంతోనే ఆయా దేశాలు నిషేధించినట్టు సమాచారం. సన్నివేశాలు లేదా కథలోని కొన్ని అంశాలు, అభ్యంతరకరంగా ఉన్నాయన్న విమర్శలతో ఈ చిత్రాన్ని నిషేధించారు.

Read Also: రజినీకి మోడీ బర్త్ డే విషెష్

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>