నేపాల్(Nepal)కు మరో విపత్తు ఢీకొట్టింది. ఇప్పటికే అక్కడ సామాజిక సంక్షోభం నెలకొని ఉంది. సోషల్ మీడియా బ్యాన్‌తో ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత తీవ్ర ఆందోళనలు చేస్తోంది. అవి కాస్తా రక్తపాతాలకు కూడా దారితీశాయి. అవి కాస్తంత చల్లారుతున్నాయ్ అనుకునేలోపే ఇప్పుడు భారీ వర్షాలు, వరదలు నేపాల్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వర్షాలతో నదులన్నీ ఉగ్రరూపం దాల్చాయి. దేశమంతా వరదలతో తల్లడిల్లుతోంది. ఇప్పటికే వరదల కారణంగా దాదాపు 18 మంది మరణించారు. ఇలమ్ జిల్లాలో వరద ప్రభావం మరీ తీవ్రంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షాలు, వరదల కారణంగా కలిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతానికి తమ దగ్గర ప్రాథమిక వివరాలే ఉన్నాయని కోషి ప్రావిన్స్ పోలీస్ ప్రతినిధి ఎస్‌ఎస్‌పి దీపక్ పోఖరేల్ వివరించారు.
Nepal | కాఠ్మాండూ వ్యాలీలో నదుల నీటిస్థాయిలు పెరిగి వరదలు, ల్యాండ్‌స్లైడ్స్‌కు కారణమవుతున్నాయి. సున్సరి, ఉదయ్‌పూర్, సప్తరి, సిరాహా, ధనుషా, మహోత్తరి, సర్లాహి, రౌతహాట్, బరా, పార్సా, సింధులి, డోలఖా, రామెఛాప్, సంధుపాల్‌చోక్, కవ్రేపాలాన్‌చోక్, కాఠ్మాండూ, లాలిత్పూర్, భక్తపూర్, మక్వన్‌పూైర్, చిత్వాన్ జిల్లాల్లో ప్రమాదం మరింత తీవ్రంగా ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

