epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

కూకట్‌పల్లి ఎమ్మెల్యే పై కవిత ఫైర్!

కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) పై కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (Madhavaram Krishna Rao) అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘నీ భర్తకు హైదరాబాద్‌లో ఆస్తులు ఎక్కడివని, బతుకమ్మ పేరిట కోట్లాది రూపాయలు వసూలు చేశారు’ అని ఆయన ఘాటు ఆరోపణలు చేశారు. దీంతో కల్వకుంట కవిత మాధవరం వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కృష్ణారావు నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం ఆయన ఫ్రస్ట్రేషన్ బయపడిందని, ఆయన చేసిన అన్ని ఆరోపణలకు ఆధారాలతో సహా వివరణ ఇస్తా అని కవిత తేల్చి చెప్పారు. ఆయన మాటలకు తాను ఫీలయ్యేది లేదని, ప్రజలు అన్ని గమనిస్తున్నారని కవిత అన్నారు.

ఎమ్మెల్యే కృష్ణారావు చేసిన విమర్శలపై నేను ఆధారాలతో సహా సమాధానం చెప్తానని ఘాటుగా సమాధానమిచ్చారు. ఆయన చేసిన ప్రతి ఆరోపణకు డాక్యుమెంట్లతో సహా ప్రెస్ మీట్ పెడతానని, కూకట్‌పల్లి 15 ఏళ్లుగా ఉన్న సమస్యలనే నేను చెప్పానని కవిత గుర్తుచేశారు. జాగృతి జనం బాటలో (Jagruthi Janam Bata) భాగంగా ఐదు రోజులపాటు హైదరాబాద్ జిల్లాలో పర్యటిస్తానని, బుధవారం కంటోన్మెంట్‌లోని బోయినపల్లి గవర్నమెంట్ స్కూల్‌లో ఉన్నామన్నారు. ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమంలో భాగంగా ఈ స్కూల్‌ను బాగు చేశారని, కానీ కాంపౌండ్ వాల్, సీసీ కెమెరాలు లేవు. వాటిని మేము ఏర్పాటు చేస్తామని కవిత (Kavitha) హామీ ఇచ్చారు.

ఈ స్కూళ్లోనే అంగన్ వాడీని కూడా కలిపారు, అంగన్ వాడీలో హెల్పర్లు లేరని కవిత మండిపడ్డారు. జనం బాటలో భాగంగా విద్య, వైద్యం మీద ఫోకస్ పెట్టామని, స్కూల్స్, హాస్పిటల్స్‌లో మౌలిక వసతులు ఎలా ఉన్నాయన్నది పరిశీలిస్తున్నామని కవిత అన్నారు. ఇండ్లు, ఇళ్ల పట్టాలను లేని వారి సమస్యలు కూడా తెలుసుకుంటున్నామని, మా వరకు చేయగలిగేది ఒక సంస్థగా చేస్తామని కవిత పేర్కొన్నారు. అలాగే టాప్ టెన్ విద్యార్థులకు మా తరఫున స్కాలర్ షిప్‌లు ఇస్తామన్నారు.

ఏ జిల్లాకు వెళ్లిన ప్రజల నుంచి ఆదరణ, సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంటోందని, ప్రజా సమస్యలను వీలైనంతగా మేము పరిష్కరిస్తామని కవిత అన్నారు. గత ప్రభుత్వంలో నన్ను నిజామాబాద్‌కే పరిమితం చేశారని, అప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఏం జరుగుతుందో చూడలేదని కవిత అన్నారు. తెలంగాణ వచ్చాక ఏం జరిగింది? ఏం జరగలేదన్నది? జనం బాట కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నానని కవిత చెప్పారు. మేము చేయగలిగేవి చేస్తామని, మిగిలిన సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని కవిత ఈ సందర్భంగా అన్నారు.

మంచిని మంచి, చెడును చెడు అనే అంటామని, ఈ స్కూల్‌ను బాగు చేస్తే. బాగుందనే అంటామని కవిత చురకలంటించారు. రాష్ట్రంలో ప్రతిపక్షం పట్టించుకోవటం లేదు, పాలక పక్షం అసలే పట్టించుకుంటలేదు. అందుకే జాగృతి జనం గళమై పనిచేస్తోందని కల్వకుంట కవిత అన్నారు.

Read Also: టీమ్ వర్క్‌తోనే గెలుపు.. టీ‌హబ్‌లో గూగుల్ స్టార్టప్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>