కలం, వెబ్‌డెస్క్: సౌదీ అరేబియా ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గతేడాది దేశంలోని ముస్లిమేతర దౌత్య సిబ్బంది కోసం తొలి మద్యం(Alcohol) దుకాణం ప్రారంభించిన సౌదీ.. నేడు తమ దేశంలో నివసిస్తున్న ముస్లిమేతరులకు కూడా మద్యం అమ్మాలని నిర్ణయించింది. అయితే, నెలకు 50వేల రియాల్లు (దాదాపు రూ.12లక్షలు) లేదా అంతకుమించి సంపాదన కలిగి, ప్రీమియం హోదా సిటిజన్‌షిప్ ఉన్న విదేశీ ముస్లిమేతరులు మాత్రమే దీనికి అర్హులు. అలాగే గతేడాది దేశంలో తొలి మద్యం (Alcohol) దుకాణం రియాద్‌లో ప్రారంభించగా, ఇప్పుడు మరో రెండు నగరాల్లో దుకాణాలు తెరవనుంది. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా విదేశీ పెట్టుబడులు, బిజినెస్‌ను ప్రోత్సహించడంలో భాగంగా సౌదీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మహిళల డ్రైవింగ్‌పై నిషేధం ఎత్తివేయడం, ప్రజా వినోద, సంగీత కార్యక్రమాలకు అనుమతించడం వంటి నిర్ణయాలను గత కొన్నేళ్లలో సౌదీ ప్రభుత్వం తీసుకుంది. ఇస్లాం మతానికి పుట్టినిల్లు అయిన సౌదీలో ముస్లింలకు అత్యంత పవిత్ర స్థలాలైన మక్కా, మదీనా ఉన్నాయి.
Read Also: మహాలక్ష్మి పథకం: 2 ఏళ్లు.. 250 కోట్ల రైడ్స్ -సీఎం రేవంత్
Follow Us On: Instagram


