Mobile Popup Ad
Mobile Popup Ad

రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. ఏప్రిల్‌లో కొత్త షాపులు: మంత్రి ఉత్తమ్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో ఏప్రిల్‌ నెలలో కొత్త రేషన్‌ దుకాణాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) వెల్లడించారు. ఇదే క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై బీజేపీ (BJP) అనుసరిస్తున్న తీరుపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాస్తే.. ‘ఇలా కాదు, మరోలా రాయండి’ అంటూ బీజేపీ నేతలు సలహాలు ఇవ్వడం విడ్డూరంగా ఉందని, వారి వ్యవహారం అనేక అనుమానాలకు తావిస్తోందని మంత్రి ఎద్దేవా చేశారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవడంలో చిత్తశుద్ధి చూపాల్సింది పోయి, సాంకేతిక కారణాలు వెతుకుతుండటం చూస్తుంటే నవ్వొస్తుందని మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యానించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>