Mobile Popup Ad
Mobile Popup Ad

కల్తీ ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రంపై దాడులు

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌ లోని ముషీరాబాద్‌లో కల్తీ ఐస్‌క్రీమ్ (Fake Ice Cream) తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్, జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడి చేశారు. బాపూజీనగర్‌లో లైసెన్స్ లేకుండా ఫ్యాక్టరీ నడుపుతున్నట్లు గుర్తించారు. నాణ్యతలేని పదార్థాలతో కల్తీ ఐస్‌క్రీమ్‌లు తయారు చేస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఎక్స్‌పైర్ అయిన పదార్థాలతో పాటు అస్వచ్ఛ పరిస్థితుల్లో ఐస్‌క్రీమ్ తయారీ జరుగుతున్నట్లు అధికారులు తేల్చారు. నకిలీ నాణ్యత హామీలతో మార్కెట్‌లో సరఫరా చేస్తున్నట్లు బయటపడిందన్నారు. ఈ ఘటనలో ఒకరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఐస్‌క్రీములు, ఎక్స్‌పైర్ ఫ్లేవరింగ్ ఏజెంట్లు, సింథటిక్ కలర్స్ సహా సుమారు రూ.1.75 లక్షల విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు చెప్పారు.

Read Also: ఒప్పందంపై లేట్ చేయొద్దు.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>