Mobile Popup Ad
Mobile Popup Ad

గవర్నర్‌ను శ్రీరామ నవమికి ఆహ్వానించిన మంత్రి

కలం, ఖమ్మం బ్యూరో : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా (Shiv Pratap Shukla) ను భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం, శ్రీరామ మహా పట్టాభిషేకాలను తిలకించేందుకు ఆహ్వానిస్తూ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Konda Surekha), దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్(Shailaja Ramaiyer), డైరెక్టర్ హనుమంతరావు రాజ పత్రాన్ని అందజేశారు.

సోమవారం హైదరాబాదులో గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన వైదిక సిబ్బంది దైవ ఆశీర్వచనాలు సమర్పించారు. తరువాత స్వామివారి ప్రసాదం జ్ఞాపికను మంత్రి కొండా సురేఖ గవర్నర్‌కు అందజేశారు. అనంతరం అధికారిక రాజపత్రాన్ని కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, భద్రాద్రి దేవస్థానం ఈవో కే. దామోదర్ రావు, అర్చకులు అమరవాది శ్రీనివాస రామానుజం, కృష్ణమాచార్యులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>