Mobile Popup Ad
Mobile Popup Ad

తిరుపతిలో ఆర్టీసీ బస్సులు ఢీ: 10 మందికి గాయాలు

కలం, వెబ్​ డెస్క్​ : తిరుపతి (Tirupati) నగరంలోని గరుడ వారధి ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ఆర్టీసీ బస్సులు ఒకదానికొకటి ఢీకొనడంతో పది మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారధిపై ముందు వెళ్తున్న ఒక ఆర్టీసీ బస్సును, వెనుక నుంచి వేగంగా వస్తున్న మరో బస్సు అదుపు తప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు ఒక బస్సు ముందు భాగం, మరో బస్సు వెనుక భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యాయి.

ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన పది మంది క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై ఈస్ట్ సిఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>