Mobile Popup Ad
Mobile Popup Ad

కొత్త పార్టీ.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కవిత

కలం, వెబ్ డెస్క్: ‘తెలంగాణ ప్రజా జాగృతి’ (Telangana Jagruthi) పేరుతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) కొత్త రాజకీయ పార్టీ పెట్టనుంది. ఈ పార్టీ రిజిస్ట్రేషన్ కోసం కవిత ఎన్నికల సంఘానికి గత నెల అప్లికేషన్ పెట్టారు. అదేరోజు కవితకు కేంద్ర ఎన్నికల సంఘం రిప్లై ఇచ్చింది. అయితే ఈసీ స్పందించే ముందే ఢిల్లీ హైకోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. తన పార్టీని రిజిస్టర్ చేసి గుర్తు కేటాయించేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

కవిత (Kavitha) పిటిషన్‌పై ఫిబ్రవరి 27న విచారణ జరిపిన హైకోర్టు.. నేటికి వాయిదా వేసింది. అప్లికేషన్‌లో కొన్ని లోపాలు గుర్తించినట్లు ఈసీ (EC) హైకోర్టుకు తెలిపింది. అదే విషయాన్ని కవితకు కూడా తెలియజేసినట్లు కోర్టుకు ఈసీ వివరించింది. దీంతో ఢిల్లీ హైకోర్టును మాజీ ఎమ్మెల్సీ కవిత ఆశ్రయించారు. జాగృతి పార్టీ రిజిస్ట్రేషన్ పై కేంద్ర ఎన్నికల సంఘం ఆలస్యం చేయడంతో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ ఢిల్లీ హైకోర్టు ఈ కేసుపై విచారణ జరపనునుంది. దీంతో ఢిల్లీ హై కోర్టు తీర్పుపై ఆసక్తి నెలకొంది.

Read Also: తెలంగాణ భవన్‌లో పంచాంగ శ్ర‌వ‌ణం.. బీఆర్ఎస్‌కు త్వ‌ర‌లో గుడ్ డేస్‌!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>