epaper
Thursday, March 5, 2026
epaper

పుదుచ్చేరి ఏఐసీసీ అబ్జర్వర్‌గా పొన్నం ప్రభాకర్

కలం, వెబ్​ డెస్క్​ : పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రత్యేక పరిశీలకులుగా ఇద్దరు నేతలను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు తెలంగాణ నుంచి పొన్నం ప్రభాకర్ ను (Ponnam Prabhakar) ప్రత్యేక పరిశీలకులుగా నియమించినట్లు AICC ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.

పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ, పార్టీ కార్యకలాపాల పర్యవేక్షణలో ఈ ఇద్దరు నేతలు కీలక పాత్ర పోషించనున్నారు. పార్టీ వ్యూహాలు, ప్రచార కార్యక్రమాలు, స్థానిక నాయకులతో సమన్వయం వంటి అంశాల్లో వారు ప్రత్యేకంగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

Read Also: తెలంగాణ IPS కు అమిత్ షా బంపర్ ఆఫర్

Follow Us On: Sharechat

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!